హూజూరాబాద్‌కు కోట్ల వరద..!
ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి వందల కోట్ల పనులు మంజూరు చేయడం సీఎం కేసీఆర్ ఫార్ములా. గతంలో దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల ఉపఎన్నికల సమయంలో కేసీఆర్ వందల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశారు. ఉపఎన్నికలు ముగిసే వరకూ వాటి గురించి విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు.. హుజూరాబాద్ విషయంలోనూ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు.
హుజురాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు వెంటనే మంజూరుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాగునీటి కోసం 10 కోట్లు… వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చేశారు. మిగతా ఉప ఎన్నికల మాదిరిగా హుజూరాబాద్ లో అభివృద్ది ఒక్కటే సరిపోదు. అందుకే ప్రత్యేకంగా జిల్లా చేయడం దగ్గర్నుంచి ఇంకా చాలా ఆలోచనలు చేస్తున్నారు. మరీ.. అవి ఫలించి తెరాస గెలుస్తుందా ? అన్నది చూడాలి.