మరోసారి నగ్నంగా కియరా

కేవలం ఓ ఆకును ఆచ్ఛాదనగా పెట్టుకొని తన ఫొటోలతో గతేడాది కియరా అడ్వానీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి నగ్నంగా తయారైంది కియరా. ఈసారి కూడా డబూ ఫొటోగ్రఫీ కోసమే. సముద్రం ఒడ్డున కియరా నగ్నంగా పడుకున్న ఫొటోను తన కెమెరాలో బంధించాడు డబూ.

ఈ ఫొటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసిన కియరా.. ఇదే తన ఆల్ టైమ్ ఫేవరెట్ అంటూ స్పందించింది. అయితే గతేడాది కియరాపై డబూ చేసిన ఫొటో షూట్ తో పోలిస్తే ఇదేమంత ఆకట్టుకోవడం లేదు. టాప్ లెస్ పోజు అయినా… పడుకొని ఉండటం, పైగా బ్లాక్ అండ్ వైట్ లో తీయడంతో అందాలు పెద్దగా ఎలివేట్ కాలేదు. కానీ ఆ మూడుని మాత్రం క్యారీ చేసింది. 

ఇక భరత్ అను నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కియారా. ఆ తర్వాత వినయ విధేయ రామలో రామ్ చరణ్ కి జంటగా నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ బ్యూటీకి బాలీవుడ్ లో గిరాకీ పెరిగింది. దీంతో తెలుగు సినిమాలు చేయడానికి టైమూ లేదు అంటోంది.