పవన్ కు సప్రైజ్ గిఫ్ట్.. కేంద్ర మంత్రి పదవి ?

కేంద్ర మంత్రివర్గంలో భారీ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల్లో వేడి వేడి చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మిత్రపక్షాల ను కలుపుకుని వెళ్లే రీతిలో మంత్రివర్గ కూర్పు ఉండేలా మోడీ ప్రయతి స్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది.

పవన్ పదవి ఆశించే టైపు కాదు. ఆయన కావాలంటే తెదేపా హయాంలోనే రాష్ట్రంలో, కేంద్రంలోనూ మంత్రి అయ్యేవారు. అలాంటిది హఠాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ నుండి పవన్ కళ్యాణ్ కు పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు రావడం విశేషం. దీనికి  ప్రధాన కారణం ఆర్ ఎస్ ఎస్ లో ప్రముఖుడైన బి ఎల్ సంతోష్ పవన్ కళ్యాణ్ కి పదవి ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఢిల్లీ లోని కొన్ని వర్గాల నుండి లీక్ కావడమే అంటున్నారు. మరీ.. నిజంగానే పవన్ కేంద్ర మంత్రి అవుతారా ? అన్నది చూడాలి.