96 శాతానికి రికవరీ రేటు !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.
గడిచిన 24 గంటల్లో 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. మరో 2,330మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 2.97కోట్లకు చేరింది. మృతుల సంఖ్య 3,81,903కి చేరింది. ప్రస్తుతం 8,26,740మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.78శాతానికి తగ్గింది. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది.