టెస్టు ఛాంపియన్‌షిప్ – వరల్డ్ కప్ ఒక్కటే ?
టెస్టు ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకోవడం ప్రపంచ కప్ గెలవడంతో సమానమో ? ఆ విషయం తనకు తెలీదు అంటున్నాడు యువరాజ్. దీన్ని వివరించేందుకు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ సరైనవాళ్లు. 2011 ప్రపంచకప్ జట్టులో ఉన్నాడు కాబట్టి విరాటే చెప్పగలడని అన్నారు.
ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ ప్రయోజనం కనిపిస్తోందని యువీ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించడమే ఇందుకు కారణం. కివీస్ కు ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ లభించిందన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడు మ్యాచులు ఉంటే బాగుండేదన్నాడు.