40 లక్షలు దాటిన కరోనా మరణాలు
మహమ్మారి కరోనా ప్రపంచ దేశాలని వణికించింది. ఏడాదిన్నర కాలంలోనే లక్షల మందిని బలి తీసుకుంది. తాజాగా అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 40లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలోనే 20లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 లక్షల మరణాలు కేవలం ఐదున్నర నెలల్లోనే చోటుచేసుకున్నాయి.
సగం మరణాలు కేవలం ఐదు దేశాల్లో (అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికో)నే చోటుచేసుకున్నాయి. కరోనా మరణాల్లో అగ్రదేశం అమెరికా (600934) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ (4,96,004), భారత్ (3,83,490), మెక్సికో (2,30,792), పెరూ (1,89,757) దేశాలున్నాయి.