అరియానాతో ఆర్జీవీ.. అన్నీ యాంగిల్స్ వాడేశాడు !

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వ‌ర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూనే యాంకర్ అరియానాకు పాపులారిటీ తెచ్చి పెట్టింది. ఆ క్రేజ్‌తోనే ఆమెకు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంట్రీ ద‌క్కింది. ఈ షోతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. టాప్-5లో నిలిచింది. బిగ్ బాస్ 4 తర్వాత అరియానా క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. టీవీ షోస్, సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయ్. కానీ అవి చాలదు. ఆమెని మరింత బిజీ చేయాలని ఆర్జీవీ ఫిక్సయినట్టున్నాడు. తానే స్వయంగా అరియానాని ఇంటర్వ్యూ చేశాడు.

అది కూడా బోల్డ్ గా. ఆమెతో కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తూ.. అరియానాని  అందాలని డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రజెంట్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు గతంలోనే బయటికొచ్చాయ్. తాజాగా ఈ బోల్డ్ ఇంటర్వ్యూకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. కేవలం భంగిమలు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ తప్ప, వాయిస్ లేదు. కానీ కొన్ని కొన్ని సార్లు అరియానా సిగ్గుగా, మరి కొన్ని సార్లు చెవులు మూసుకుని ప్రోమోలో కనిపించింది. దాన్ని బట్టి ఆయా చోట్ల ఎలాంటి డైలాగులు పడి వుంటాయో అర్థం అవుతోంది.

ఇది ఇంటర్వ్యూ అని కూడా చూడలేదు. అన్నీ యాంగిల్స్ ని వాడేశాడు. సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా. డైలాగుల్లేని ప్రోమోనే ఇలా వుంటే టోటల్ ఇంటర్వ్యూ  ఇంకెంత రంజుగా వుంటుందో.. ! ఈరోజు రాత్రి 7గంటలకు ఫుల్లు ఇంటర్వ్యూని వదలనున్నాడు ఆర్జీవీ.