CBSE : జులై 20న పది, 31న 12వ తరగతి ఫలితాలు

CBSE ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చారు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌. జులై 20కి పదో తరగతి పరీక్షల ఫలితాలు, జులై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలను ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా ప్రకటించనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

వీలైనంత త్వరలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫలితంతో ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే, అలాంటివారు పరీక్ష రాసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తాం. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఎగ్జామ్స్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం’ అని భరద్వాజ్‌ తెలిపారు.