అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ ?
దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తోన్న రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి థర్డ్‌వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని మరో అంచనా.
అక్టోబర్ నాటికి చాలామందికి వ్యాక్సిన్ అందడంతోపాటు రెండోవేవ్ వల్ల కలిగే రోగనిరోధకత దీనికి దోహదం చేస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంటుందన్న వార్తలు మరింత భయానికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి ఐసీయూ పడకలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, ముప్పు ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందంటున్నారు. అప్పటిలోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్టై.. వైద్య సదుపాయలు కల్పిస్తే పెను ప్రమాదం తప్పినట్టే.