ఈ అందం ముందు సముద్రం చిన్నబోయింది

నిండైనా అందాలు ఆమె సొంతం. వాటిని ఏమాత్రం దాచుకోకుండా.. తరచూ ఫోటో షూట్ చేస్తుంటుంది. హాట్ హాట్ అందాలని అభిమానులని అలరిస్తుంటుంది. ఆమె ఎవరో.. ఈ పాటికే అర్థమై ఉంటుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ. సినిమాలు చేయడానికి గ్యాప్ తీసుకుంటుందేమో.. గానీ ఫోటో షూట్స్ చేయడానికి మాత్రం టైమ్ తీసుకోదు.

ఆమె నుంచి వారానికో ఫోటో షూట్ అన్నట్టుగా హాట్ హాట్ ఫోటోలు క్యూ కడుతుంటాయ్. తాజాగా సముద్రం ఒడ్డున నిల్చొని.. చేతిలో గవ్వలు పట్టుకొని.. కాసింత సిగ్గుపడుతున్న పిక్ ఒకటి దిశా షేర్ చేసింది. వెనక సముద్రం అందాలు అద్భుతంగా కనిపిస్తున్నా.. ఈ హాట్ బ్యూటీ అందం ముందు అవి చిన్నబోయినట్టు కనిపిస్తున్నాయి. ఆ అందాలని మీరు ఆస్వాదించండి..!