రివ్యూ : జ‌గ‌మే తంత్రం

చిత్రం : జ‌గ‌మే తంత్రం (2021)

నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, James Cosmo.. తదితరులు

సంగీతం : సంతోష్ నారాయణన్

దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజు

నిర్మాతలు : శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర

ఓటీటీ రిలీజ్ : నెట్ ఫ్లిక్స్

రిలీజ్ డేటు : జూన్ 18, 2021.

పిజ్జా, జిడ‌త్తాండ‌ చిత్రాలతో దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజుకంటూ ఓ బ్రాండ్ ఏర్ప‌డిపోయింది. ఏకంగా ర‌జ‌నీకాంత్ తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ర‌జ‌నీతో చేసిన ‘పేట్టా’ ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. ఇప్పుడు ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ తో ‘జ‌గ‌మే తంత్రం’ చేశాడు. ఈరోజు నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా విడుద‌లైన ‘జ‌గ‌మే తంత్రం’ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది.. తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

మ‌ధురైలో సురుళి (ధ‌నుష్) ఓ లోక‌ల్ దాదా. చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేసుకుంటుంటాడు. మ‌రోవైపు లండన్ లో శివ‌దాస్ (జోసెఫ్ జోజు), పీట‌ర్ (జేమ్స్ కోస్మో) అనే రెండు గ్యాంగ్ లు ఉంటాయి. శిద‌దాస్ ని అణ‌చి వేయడానికి సురుళికి భారీగా డ‌బ్బు ముట్ట‌జెప్పి లండ‌న్ ర‌ప్పిస్తాడు పీట‌ర్‌. పీట‌ర్ డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి… శివ‌దాస్ ముఠా జోరుకి అడ్డుక‌ట్ట వేస‌క్తాడు సురుళి. 
అంతేకాదు.. ఓ మాస్ట‌ర్ ప్లాన్ తో శివ‌దాస్ ని కూడా చంపిస్తాడు. అక్క‌డితో క‌థ ముగిసిపోలేదు. అక్క‌డి నుంచి.. అస‌లు స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. దానికి కార‌ణం.. సుర‌ళి ప్రేమించిన అమ్మాయి అఖిల (ఐశ్వ‌ర్య ల‌క్ష్మి). త‌న వ‌ల్లే…. సురిళిలో మార్పు వ‌స్తుంది. అస‌లు అఖిల ఎవ‌రు? త‌ను సురిళిని ఎలా మార్చింది ? అనేది మిగిలిన క‌థ‌.

ఎలా సాగింది ?
చెన్నైలోని గ్యాంగ్ స్ట‌ర్ లండ‌న్ కి రావడం, ఇక్క‌డ కాక‌లు తిరిగిన ఓ గ్యాంగ్ కి చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం. మంచి క‌మ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్. ధ‌నుష్ లాంటి హీరోకి ఈ మాత్రం లైన్ చాలు. ఐతే దర్శకుడు ఈ లైన్ కే ప‌రిమితం అయిపోలేదు.

శ‌ర‌ణార్థులు అనే మ‌రో పాయింట్ ప‌ట్టుకున్నాడు. అంటే ఒకే క‌థ‌లో రెండు పాయింట్లు అన్నమాట. ఈ రెండు పాయింట్లు సరిగ్గా అతకలేదు. తొలిభాగం సాదాసీదాగా సాగింది అనుకుంటే.. ద్వితీయార్థం ఇంకా దారి తప్పింది. బోర్ కొట్టించింది.

ఎవరెలా చేశారు ?
ఇక నటన విషయానికొస్తే.. ధనుష్ ఈజీగా నటించేశారు. సినిమాలో హైలైట్ ఏదైనా ఉందంటే.. అది ధనుష్ నటనే.  ఐశ్వ‌ర్య ల‌క్ష్మిది రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర కాదు. డ్యూయొట్లు లాంటివేం లేవు కాబ‌ట్టి. ఐశ్వ‌ర్య‌లో కేవ‌లం పెర్‌ఫార్మ్సెన్స్ మాత్ర‌మే చూసే అవ‌కాశం దక్కింది. విలన్లు బాగానే చేశారు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతికంగా : 
ద‌ర్శ‌కుడు ఓ బ‌ల‌మైన పాయింట్ ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించి చూపించాల‌నుకున్నాడు.అటు హీరోయిజానికీ, శ‌ర‌ణార్థులు అనే పాయింట్ కి సరిగ్గా కుదరలేదు. ఇక తెలుగు ప్రేక్షకులని మెప్పించే స్థాయిలో పాటలు లేవు. నేప‌థ్య సంగీతం బాగుంది. సెకాంఢాఫ్ లో సాగదీత అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : జ‌గ‌మే తంత్రం.. రొటీన్ గ్యాంగ్ స్టర్ స్టోరీ.. !

రేటింగ్ : 2.75/5

నోట్ : ఇది సమీక్షకుడి వ్యతిగత అభిప్రాయం మాత్రమే.