‘రాజ రాజ చోర’ టీజర్ టాక్

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించే ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల నిర్మాణ నిర్వాహకుడు. జూలైలోనే ఈ సినిమా తెరమీదకు రానుంది. తాజాగా టీజర్ ని విడుదల చేశారు.

బయటకు సాఫ్ట్ వేర్ గా కనిపిస్తూ దొంగతనాలు అసలు వృత్తిగా పెట్టుకున్న హీరో. అక్కడే పక్కా విలన్ లాంటి పోలీస్ ఆఫీసర్. వీళ్లద్దరి మధ్య జరిగిన దాగుడుమూతల ఆట. మధ్యలో హాట్ .. క్యూట్ హీరోయిన్ మేఘా ఆకాష్ తో రొమాన్స్. గంగవ్వతో హీరో ముచ్చట్లు.. ఇలా టీజర్ ని ఆసక్తిగా కట్ చేశారు. కథ ఎలా ఉన్నా.. కామెడీ ఫుల్ అనే హింట్ ఇచ్చేశారు.