బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల లాటరీ !

నటుడు బ్రహ్మాజీకి రూ.4.65కోట్లు లాటరీ తగిలింది. ఆ డబ్బునితీసుకురావాల్సిందిగా హైదరాబాద్ పోలీసులని కోరారు బ్రహ్మాజీ. అసలు విషయం ఏంటంటే ?మీరు ఇంత డబ్బును గెలుచుకున్నారంటూ మీ పేరు, చిరునామా ఇవ్వాల్సిందిగా గుర్తుతెలియని ఫోన్‌ నెంబర్‌ నుంచి తరచూ మనకు మెసెజ్‌లు వస్తూనే ఉంటాయి. బ్రహ్మాజీకి ఇలాంటి మెసేజ్ ఒకటి వచ్చింది. 

ఆ ఫోన్‌ నెంబర్‌ ట్వీట్‌లో పేర్కొంటూ ‘సార్‌ నాకు ఈ నెంబర్‌ నుంచి రూ.4.65 కోట్లు లాటరీ తగిలిందని యూకేకు చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మెసెజ్‌ వచ్చింది. దయ చేసి మీరు ఈ డబ్బులను తీసుకురాగలరు’ అంటూ సిటీ పోలీసులు, సైబరాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేశాడు. ఇప్పుడీ.. ఈ ట్విట్ వైరల్ అవుతోంది. ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో బ్రహ్మాజీ పోలీసులకు ట్యాగ్ చేశారు. మరీ.. ఆ ప్రైజ్ మణి పోలీసులు తీసుకుంటారా ? లేక ఆ మెసేజ్ పంపించిన వారిని పట్టుకుంటారా?? అన్నది చూడాలి.