WTC Final : టీమిండియా తుది జట్టులో మార్పులు ?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డుపడిన సంగతి తెలిసిందే. దీంతో తొలి సెషన్ రద్దు అయింది. ఇప్పటి వరకు టాస్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలున్నాయని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు.

వర్షం కారణంగా జట్టులో ఒక స్పిన్నర్‌ను తొలగించి అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసే వీలుందని ఆయన అంచనా వేశారు. ఇప్పుడు సౌథాంప్టన్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని భారత్‌ ఆలోచించొచ్చు. ఎందుకంటే ఈ వాతావరణం న్యూజిలాండ్‌ బౌలర్లకు అనుకూలం. పంత్‌ ఇప్పుడు ఆరో స్థానంలో ఆడనున్నాడు. ఇంకో బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే అతడు ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక స్పిన్నర్‌ను తప్పించొచ్చు అని చెప్పుకొచ్చారు.

భారత్ ప్రకటించిన తుది జట్టు :
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ.