60వేల కేసులు..1,647 మరణాలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వస్తోంది. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా రికవరీ రేటు 96శాతానికి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 60,753 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1,647 మంది మృతి చెందారు. ప్రస్తుతం మొత్తం కేసులు 2.98కోట్లకు చేరగా..3,85,137 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 7,60,019 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 2.55 శాతానికి తగ్గింది. నిన్న 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2.86కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగింది. మరోపక్క నిన్న 33,00,085 మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 27కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం వెల్లడించింది.