TSలో మహిళకు ఒకేసారి రెండు డోసులు

కరోనా వాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలి. కానీ ఒక్కోడోసుకు కనీసం 15రోజుల గ్యాప్ తీసుకోవాలి. అయితే తెలంగాణలో ఓ మహిళకు ఒకేసారి రెండు డోసుల కరోనా టీకా వేసిన ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ జడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ నెల 17న లక్ష్మీప్రసన్న అనే మహిళకు నర్సు రెండు డోసులు వ్యాక్సిన్ వేసింది. అలాగని ఇది కావాలని చేసిన పనేం కాదు. మొదటి డోసు వేసుకున్న మహిళను గమనించని నర్సు.. వేరే మహిళ వచ్చిందనుకొని రెండో డోసు కూడా వేసినట్లు తెలుస్తోంది. లక్ష్మిప్రసన్నను వైద్య సిబ్బంది వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఈ ఉదయం ఆమెను డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.