ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు నాని గిఫ్ట్ !

కరోనా విజృంభిస్తున్న వేళ వైద్యులే కనిపించే దేవుళ్లు అయ్యారు. అనేక మంది ప్రాణాల్ని రక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకి బహుమతిగా ‘దారే లేదా..’ అనే పాటని హీరో నాని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కె.కె. సాహిత్యం అందించారు. నటులు సత్యదేవ్‌, రూప ఈ గీతంలో కనిపించారు.

వృత్తి రీత్యా సత్యదేవ్‌, రూప వైద్యులు కావడంతో ఉదయం వేళ కార్తిక్‌(సత్యదేవ్‌), రాత్రి విధుల్లో శృతి(రూప) కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. ఇలా వైద్యులు తమ వృత్తికోసం, కొవిడ్‌ బాధితుల ప్రాణాలను రక్షించడం కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో, ఎంత రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని ఈ పాటలో చాలా ఎమోషనల్‌గా చూపించారు.