ఈటెలని తిట్టు.. పదవి పట్టు !

ఈటలను టీఆర్ఎస్ సీనియర్లందరూ చెడామడా తిట్టేస్తున్నారు. అది ఆయనపై కోపంతో కాదు. సొంత పార్టీ, సీఎం కేసీఆర్ పై ప్రేమతో కాదు. పదవి కోసం. అవునూ.. ఇప్పుడు తెరాస సీనియర్లకు ఈటెల సాయం చేస్తున్నాడు. సీనియర్ నేతలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఈటెలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ? వీరి ఎమ్మెల్సీ పదవులు రెనివల్ చేయాల్సి ఉంది. అందుకే ఈటెలని బాగా తిట్టేసి.. సీఎం కేసీఆర్ ని ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు.

కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి అయిపోయింది. ఖాళీగా ఉన్నారు. ఇటీవల ఎవరిపైనా విమర్శలు చేస్తున్నట్లుగా లేదు. వాస్తవానికి ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఉంది. ఇంతలో ఈటెల రూపంలో కడియంకు ఓ అవకాశం దక్కింది. ఆయన్ని తిట్టేసి.. మళ్లీ ఎమ్మెల్సీ పోస్ట్ ని కొట్టేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డిది దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం శాసన మండలి లో ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీ అయ్యాయి. అందులో ఐదు స్థానాలు కొత్త వారితో భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో రెండు స్థానాలు మాత్రమే పాత వారికే రెన్యువల్ చేస్తారని అంటున్నారు. ఆ జాబితాలో కడియం, గుత్తా ఉంటారేమో చూడాలి.