మిల్కా సింగ్ ఇకలేరు !
భారత స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ (91) కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మే 20న ఆయనకు కరోనా సోకంది. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మిల్కా సతీమణి నిర్మల్ కౌర్ గతవారం కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
పరుగు పోటీల్లో మిల్కాసింగ్ అరుదైన రికార్డులు నెలకొల్పారు. 46.6 సెకన్లలో 440 యార్డ్స్ పరుగెత్తి స్వర్ణం గెలిచిన మిల్కా.. భారత్ తరపున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. 1959లో కేంద్ర ప్రభుత్వం మిల్కాసింగ్‌కు పద్మశ్రీ ప్రదానం చేసింది. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘బాగ్ మిల్కా బాగ్’ చిత్రం రూపొందించారు.
మిల్కా సింగ్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది హృదయాల్లో మిల్కా ప్రత్యేక స్థానం పొందారని తెలిపారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు.