ఆహా.. అలియా అందాలు !

డబ్బూ రత్తా కెమెరా ముందు అందాల విందు చేయాలని ప్రతి హీరోయిన్, హీరో కూడా కోరుకుంటాడు. ఆయన కెమెరా పనితనం అలాంటిది మరీ.. ! తాజాగా ఆయన కెమెరాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అందాలని బంధించారు.

వాటిలో మచ్చుకు ఓ రెండో వదిలాడు. న్యూ ఇయర్ క్యాలెండర్ 2021 కోసం తీసిన ఫోటోలు ఇవి. అలియా మునుపెన్నడూ కనబడనంత కొత్తగా తీశాడు. అందాల ఆరబోత కూడా అదే రేంజ్ లో ఉంది. బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో తన తన అందాలను ఆరబోస్తూ సెక్సీ లుక్స్ తో దర్శనమిచ్చింది.

ఇంతకుముందు అనన్య పాండే, కియారా అద్వానీ, విద్యా బాలన్, సన్నీ లియోన్, తారా సుతారియా, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, సైఫ్ అలీ ఖాన్ మరియు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లు అన్యువల్ క్యాలెండర్ కోసం పోజ్ ఇచ్చారు. ఇప్పుడు అలియా వంతు వచ్చింది. అయితే ఈ యేడాది డబ్బూ తీసిన ఫోటోల్లో అలియాదే హైలైట్ అని చెప్పవచ్చు.