పక్కలోకి పిలిచిన వారి పేర్లు.. మీరు బయట పెట్టగలరా ?
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్నది నగ్న సత్యం. దాని బారినపడిన చాలామంది ఇప్పటికే నోళ్లు తెరిచారు. తాము వేధింపులకు గురయ్యామని ఓపెన్ అయ్యారు. కానీ తమని పక్కలోకి పిలిచిన వారి పేర్లని బయటికి చెప్పే సాహాసం చేయలేదు. అతికొద్ది మంది మాత్రమే తమని వేధించిన వారి పేర్లని బయటికి చెప్పేశారు.
తొలిసారి ఓ నటి తనని వేధించిన వ్యక్తుల జాబితాని బయటపెట్టింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది తనని వేధించారని వారి చిట్టా విప్పింది. మలయాళ యువ నటి రేవతి సంపత్ తనని ఇబ్బంది పెట్టిన 14మంది పేర్లను బయటపెట్టింది.
రేవతి సంపత్ బయటపెట్టిన 14 మంది జాబితాలో ‘రాజేశ్ టచ్రైవర్(దర్శకుడు), సిద్దిఖీ(నటుడు), ఆషిఖ్ మహి(ఫొటోగ్రాఫర్), షిజు(నటుడు), అభిల్దేవ్(కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్), అజయ్ ప్రభాకర్(వైద్యుడు), ఎంఎస్ పధుష్, సురభ్ కృష్ణన్, నందు అశోకన్, మ్యాక్స్వెల్ జోస్(షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్), షానుబ్ (యాడ్ ఫిల్మ్ డైరెక్టర్), రగేండ్ పాయ్(క్యాస్టింగ్ డైరెక్టర్), బిను(ఎస్సై), శరన్ లీ (బ్యాంక్ ఏజెంట్) ఉన్నారు.
వీరంతా తనని మానసికంగా, శారీరకంగా, లైంగికంగానూ వేధించారని ఆరోపించారు.
ఇన్నాళ్లు తాము సినీ పరిశ్రమలో వేధింపులకు గురయ్యామని చెప్పే వారిని మాత్రమే చూశాం. కానీ మొదటి సారి ఓ నటి తనని వేధించిన వ్యక్తుల జాబితాని బయటపెట్టింది. రేవతి మాదిరిగానే మిగితా నటీనటులు ఇలా బయటి చెప్పేస్తే.. ఆ భయంతోనే క్యాస్టింగ్ కౌచ్ ఆగిపోతుందేమో.. !