TSలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఈరోజు ఎన్నంటే ?

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1197 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 3,576 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 965 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్నీ రకాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయ్. జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి.