‘అఖండ’ విడుదల ఎప్పుడంటే ?

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. రిలీజ్ కి రెడీ అవుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడీ.. ఈ సినిమా రిలీజ్ కోసం కొత్త డేటుని ప్రకటించే పనిలో చిత్రబృందం ఉంది.  ఈ వినాయక చతుర్థి కానుకగా అంటే సెప్టెంబర్‌ 10న ‘అఖండ’ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారమ్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో అఖండపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌.తమన్‌ సంగీతం అందించారు. మిర్యాల రవీందర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.