తెరాస ఎమ్మెల్యేకు చేదు అనుభవం

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాలని ప్రారంభిస్తున్నారు. ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ భవనాలకు సీఎం ప్రారంభించారు. ఇక ఈరోజు సీఎం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అయితే ఈ పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 

సీఎం పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని కేయూ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దే పోలీసులు తన వాహనాన్ని నిలిపివేయడంతో ఎమ్మెల్యే మనస్తాపం చెందారు. దీంతో అక్కడి నుండి మినిస్టర్ క్యాంపు కార్యాలయం వరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్లారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే పోలీసులు గౌరవం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది.