కరోనా థర్డ్ వేవ్ పై కేసీఆర్ ప్రకటన
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిపై వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ స్పందించారు. కరోనా వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుందన్నారు. అంతే కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్టయింది.
ఇక పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేయడంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పేదలు ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ ఎత్తేశామన్నారు. సగం జిల్లాల్లో నో కరోనా అన్నారు. వైద్యాధికారులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సడలింపులు పెట్టినా వ్యాప్తి లేదని… ఇదే విషయాన్ని అధికారులు చెప్పారన్నారు. అవన్నీ చర్చించిన తర్వాతే లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేతపై విమర్శలు చేస్తున్నవాళ్లకి.. విజ్ఞానానికే వదిలేస్తున్నాం అన్నారు.