ఈటలకు ఆత్మీయ స్వాగతం

ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈటలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇతర ముఖ్యనేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈటల రాకతో బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొందని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి, అరాచకాలను, కుటుంబ పాలనను ఎదిరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. అందుకే ఈటల వంటి ఉద్యమకారులందరూ బీజేపీలోకి వస్తున్నారు.
ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని బండి చెప్పుకొచ్చారు. తొలిసారి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన ఈటెల ఆనందంగా కనిపించారు. నవ్వుతూ.. నేతలని పలకరించారు. అయితే రాజకీయాల్లో కనిపించే నవ్వుల వెనక కనిపించని ద్రోహాలు కూడా ఉంటాయ్. వాటిని గమనిస్తూ.. ముందుకు సాగితేనే రాణించగలరు. సీనియర్ నేత అయిన ఈటెలకి ఇలాంటివి తెలియక ఉండవనుకోండి..!
రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు.
ఒక ఆశయం, తపన, నిర్దేశిత లక్ష్యం కోసం ఈటల రాజేందర్ గారు పోరాటం చేశారు.
రాష్ట్రంలో ఒక గడీల పాలన, అవినీతి, అరాచక, కుటుంబపాలన నడుస్తోంది.
నిజమైన ఉద్యమకారులంతా నేడు బిజెపిలో చేరుతున్నారు.
:- @bandisanjay_bjp pic.twitter.com/tTErnqvNfk— BJP Telangana (@BJP4Telangana) June 21, 2021