కారు ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన హరీష్
మంత్రి హరీష్ రావుకి ఆదివారం పెద్ద ప్రమాదమే తప్పింది. సిద్దిపేట శివారులో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నుంచి హరీష్ క్షేమంగా బయటపడ్డారు. కానీ హరీశ్‌రావు గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. రహదారికి అడ్డుగా వచ్చిన అడవి పందులను తప్పించే క్రమంలో పైలట్ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని మిగిలిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
మంత్రి హరీష్ రావుకి కారు ప్రమాదం అని తెలిసి.. ఆయన అభిమానులు కంగారుపడ్డారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా మంత్రి క్లారిటీ ఇచ్చారు. “సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా” అంటూ ట్విట్ చేశారు.
సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా.— Harish Rao Thanneeru (@trsharish) June 20, 2021