మంచు విష్ణు ‘మా’ ఎన్నికల ప్రచారం షురు

‘మా’ ఎన్నికల హీట్ మొదలైంది. త్వరలోనే ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (మా) ఎన్నిక‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బరిలోకి దిగనున్నారు. ఆయన అప్పుడే ప్రచారం కూడా మొదలెట్టేశారు. వరుసగా టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు.. ఆయనకు పోటీ వచ్చింది. మా అధ్యక్ష పదవి కోసం మంచి విష్ణు బరిలోకి దిగబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ సూపర్ స్టార్ కృష్ణని కలిశారు.

మా అధ్యక్షుడు పదవి రేసులో ఉన్న విష్ణు కి మద్దతుగా ఆయన తండ్రి మోహన్ బాబు కూడా ముందడుగు వేశారు. మోహన్ బాబు విష్ణుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ను ఆయన నివాసంలో కలిశారు. విష్ణు కు తమ మద్దతు ఇవ్వవలసిందిగా కోరినట్లు తెలుస్తుంది. దీంతో మా ఎన్నికల బరిలో మంచు మనోజ్ దిగడం దాదాపు ఖాయం అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కూడా మంచు విష్ణు కలుస్తారని తెలుస్తోంది. మెగా సపోర్ట్ మంచు ఫ్యామిలీకే దక్కనుందని చెప్పుకుంటున్నారు.