‘మా’ ఎన్నికలు : ప్రకాష్ రాజ్’కే మెగా సపోర్ట్

త్వరలోనే ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (మా) ఎన్నిక‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బరిలోకి దిగనున్నారు.ఈ ఎన్నికల కోసం గత రెండు నెలలుగా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు మెగాస్టార్ మద్దతు కీలకం కాబట్టి, ముందుగానే ఆయనను సంప్రదించి, అనుమతి, మద్దతు రెండూ తీసుకున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ఇప్పుడు సడెన్ మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మద్దతు ఇద్దరిలో ఎవరికి ఉండనుందని అన్నది హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు చిరుకు మంచి స్నేహితుడు. ఈ మధ్య వారి స్నేహం మరింత బలపడింది కూడా. ఈ నేపథ్యంలో చిరు సపోర్ట్ మంచు విష్ణుకే అనే ప్రచారం జరుగుతోంది. ఇదిగాక.. మంచు విష్ణుకు లోకల్ కార్డ్ పనికొస్తుందని టాక్.

అయితే మెగాస్టార్ ముందుగా తనను సంప్రదించిన ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చేసారని టాక్ వినిపిస్తోంది. కాస్త సమర్థత గలవారు పగ్గాలు చేపడితే బాగానే వుంటుంది. ఈ ఆలోచనతోనే ప్రకాష్ రాజ్ కు చిరు మద్దతు ఇచ్చేసారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే మోహన్ బాబు చిరుని కలసిన తర్వాత ఈ ఈక్వెషన్స్ మారవచ్చని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా సపోర్ట్ ఇప్పటి వరకైతే ప్రకాష్ రాజ్ కే. అది మారిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు.