తారక్-త్రివిక్రమ్ సినిమా లెటెస్ట్ అప్ డేట్

తారక్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ ఆకట్టుకొంది. వీరి కాంబోలో మరో సినిమా ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే సినిమా ఇదే అని చెప్పుకున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ల పుణ్యమా అని టాలీవుడ్  లెక్కలు అన్నీ మారిపోయాయ్. ఈ క్రమంలో తారక్-త్రివిక్రమ్ సినిమా కూడా ఆగిపోయింది. నెక్ట్స్ త్రివిక్రమ్ తో అనుకున్న తారక్ సినిమా కొరటాల శివతో ఫిక్సయింది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఫిక్సయ్యాడు. పుష్ప తర్వాత కొరటాల సినిమా కాకుండా.. ఐకాన్ చేయాలని అల్లు అర్జున్ ఫిక్సయినందు వలన ఈ ఈక్వెషన్స్ మారినట్టు తెలుస్తోంది. 

కారణం ఏమైనా త్రివిక్రమ్-తారక్ సినిమా క్యాన్సిల్ అయింది. మొత్తానికే క్యాన్సిల్ అయినట్టేననే వార్తలు వినిపించాయి. అయితే లెటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ? తారక్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ కాలేదు. ఉంటుంది. ఎప్పుడంటే.. ? మహేష్ తో త్రివిక్రమ్ సినిమా తర్వాత తారక్-త్రివిక్రమ్ ల సినిమా ఉండనుందట. మహేష్ సినిమాని వచ్చే  యేడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడట. ఆ తర్వాత తారక్ తో సినిమా మొదలెట్టి 2022 దసరాకి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత తారక్ కోసం ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నాడు. అంతేకాదు.. కోలీవుడ్ దర్శకుడు అట్లీతోనూ తారక్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. తారక్ చేయాల్సిన సినిమా జాబితాలో ఇప్పటికైతే మూడ్నాలుగు ఉన్నాయి.