పవన్-హరీష్ సినిమా.. ముహూర్తం ఫిక్స్ !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా.. అవి ‘గబ్బర్ సింగ్’ని మించిన ఆనందాన్ని ఆయన అభిమానులకి ఇవ్వమేమో! అంత అద్భుతంగా ‘గబ్బర్ సింగ్’ని తీశాడు హరీష్ శంకర్. ఇప్పుడు వీరికాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ రీమేక్ లతో బిజీగా ఉన్నారు. ఈ రెండు కూడా ఏకకాలంలోనే తెరకెక్కుతున్నాయ్. అవి పూర్తికాగానే హరీష్ శంకర్ సినిమాని ప్రారంభిస్తారని అనుకున్నాం. కానీ అంతకంటే ముందే ఈ సినిమా మొదలవ్వబోతుందట.

ఇంకా చెప్పాలంటే.. ఇప్పటికే ముహూర్తం ఫిక్సయింది. జులై మూడోవారం నుంచి పవన్-హరీష్ ల సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారమ్. ఇక పవన్, ఆయన అభిమానులకు గబ్బర్ సింగ్ అంతకుమించిన హిట్ ని ఇవ్వాలనే కసితో హరీష్ ఉన్నారు. ఇందుకోసం ఓ అద్భుతమైన కథని రాసుకొన్నారట. ఇందులో పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారట. అలాగే సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ అభిమానులకి కిక్కునిచ్చేలా ఉంటుదట. ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. అంటే గబ్బర్ సింగ్ లా కనిపిస్తారట.