పాపం ప్రగ్య.. ప్రచారం మాత్రమే !

ఫన్ రైడ్ ఎఫ్2 కి సీక్వెల్ గా ఎఫ్3 రెడీ అవుతోంది. ఇప్పటికే సగం పూర్తయింది. ఎఫ్ 2లో వున్న తమన్నా, మెహరీన్ లకు తోడుగా ఓ కీలక పాత్రకు అంజలిని కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఎఫ్3లో మరో హీరోయిన్ జాయిన్ అయింది. ఐతమ్ సాంగ్ కోసం ప్రగ్యజైశ్వాల్ ని తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఐటమ్ సాంగ్ ప్రచారం మాత్రమే ప్రగ్యపైనా.. నిజానికి ఎఫ్3తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆమెని తీసుకోలేదు. ఎఫ్ 3లో ఐటమ్ సాంగ్ కూడా అంజలిదే. ఇక మైసూర్ లో ఒక లెంగ్తీ షెడ్యూలు చేయాల్సి వుంది. అది పూర్తయితే సినిమా దాదాపు పూర్తయినట్టే. ఎఫ్ 2లో వెంకీ-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ జంట మేజిక్ చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ 3తో ఆ మేజిక్ ని మరోసారి రిపీట్ చేయాలని చిత్రబృందం ఆశపడుతోంది.