‘మా’ అధ్యక్ష బరిలో.. ‘ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు’ ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (మా) ఎన్నిక‌ల హీట్ అప్పుడే మొదలైంది. ఈసారి ఎన్నికలు ర‌స‌వ‌త్త‌రంగా మారబోతున్నాయి. ‘పొలిటికల్ సపోర్ట్ వర్సెస్ సినీ సపోర్ట్’గా ఎన్నికలు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. మా ఎన్నికల్లో అధ్యక్షుడి పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బరిలో దిగబోతున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు. ఆయనకు టీఆర్ఎస్ తో మంచి సంబంధాలున్నాయ్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో తత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే మా అధ్యక్షుడు ప్రకాష్ రాజ్ అనుకుంటున్నారు. ఇంతలో ఆయనకు పోటీకి మంచి ఫ్యామిలీ బరిలోకి దిగనుందనే వార్తలు వినిపిస్తున్నాయ్. 

మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు బరిలో నిలవనున్నారని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలున్నాయి. వీరి మధ్య బంధుత్వం ఉంది. ఇదీగాక.. ఇటీవల మెగా-మంచి కుటుంబాల మధ్య బంధం మరింత బలపడింది. మంచు ఫ్యామిలీ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉన్నట్టు మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ మంచు మనోజ్ కి దక్కేలా కనిపిస్తోంది. అయితే మంచు మనోజ్ బరిలోకి దిగే ముందు చిరుని కలవనున్నారు. ఆయన ఓకే అంటేనే పోటీలో ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా విష్ణుకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈసారి మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని మించి హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.