Thalapathy65 టైటిల్ ‘బీస్ట్’.. ఫస్ట్ లుక్ అదిరింది !

కోలీవుడ్ స్టార్ విజయ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. విజయ్ బర్త్ డే కానుకగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ప్రకటన చేశారు. ఇది విజయ్ నటించినున్న 65వ సినిమా. విజయ్ తన 65 సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు బీస్ట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో గన్ తో నడుస్తూ కనిపించాడు విజయ్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.