హన్మకొండ జిల్లాగా వరంగల్ అర్బన్ !

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరు మారింది. హన్మకొండ జిల్లాగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉత్త‌ర్వులు రెండు, మూడు రోజుల్లోనే వ‌స్తాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పేరు మార్పుపై ప్రకటన చేశారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మారుస్తున్నట్టు తెలిపారు.

ఇక అధునాత‌న జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌న‌వాన్ని ప్రారంభించుకోవ‌డం ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు బాగా తెచ్చుకున్నాం. అవ‌న్నీ ప‌రిపుష్టం కావాలి. అప్పుడే అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. ప్ర‌భుత్వం అంటే ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌న‌ప్పుడే నిజ‌మైన ప‌రిపాల‌న. ప‌నులు వేగంగా జ‌రిగితేనే ప్ర‌జాస్వామ్యం విజ‌య‌వంత‌మ‌వుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. 

Live: CM Sri KCR speaking after inaugurating Warangal Urban Integrated Collector Complex https://t.co/fWvcQyHpvA— Telangana CMO (@TelanganaCMO) June 21, 2021