WTC Final : నాల్గోరోజు కూడా వర్షార్పణం

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కి మరోసారి వరుణుడు అడ్డుపడ్డారు. వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయిన సంగతి తెలిసిందే. రెండు, మూడోరోజు వరుణ దేవుడు కాస్త కరుణించాడు. దీంతో రెండ్రోజుల పాటు మ్యాచ్ సజావుగానే సాగింది. ఇక నాలుగో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది.

ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో కనీసం ఒక్క సెషన్ కూడా సాధ్యపడలేదు. లంచ్ తర్వాత కూడా వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ కాగా, కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. భారత్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడే ఉంది.