విజయ్ కోసం కీర్తి సురేష్ అదిరిపోయే స్టెప్పులు

కోలీవుడ్ స్టార్ విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. విజయ్ ఫోటోలు, ఆయన సినిమా పోస్టర్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. కొందరు అభిమానులు, సినీ ప్రముఖులు విజయ్ కి ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నారు. 

ఈ క్రమంలో హీరోయిన్ కీర్తి సురేష్ విజయ్ కోసం ఓ డ్యాన్స్ వీడియో చేసింది. ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… విజయ్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇందులో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది కీర్తి. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక విజయ్ తన అభిమానులకి బర్త్ డే కానుక అందించిన సంగతి తెలిసిందే. తన 65వ సినిమాకు సంబంధించి ఫస్ట్, సెకండ్ లుక్స్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు బీస్ట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.

Dancing for Aal Thotta Boopathy!
An ardent fan of #Thalapathy!❤️

You are not only one of the best at performing, but you are one of a #Beast at entertaining. ❤️@actorvijay sir #ChummaCasualah with thambi @PawanAlex 🤗 @ShruthiManjari 👚💝 #HBDThalapathyVijay pic.twitter.com/GeY2MOrfAW— Keerthy Suresh (@KeerthyOfficial) June 22, 2021