మీసం మెలేసిన మహేంధ్రుడు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొత్తలుక్‌లోకి మారిపోయాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడటంతో కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరిన ధోనీ ఇప్పుడు కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లాడు. కుటుంబంతో సహా మహీ ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లాకు వెళ్లాడు. ధోని సిమ్లా టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జీవా, సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

ఇందులోని సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. మీసం మేలేసి చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమా బాషలో చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మాదిరిగా మీసం మెలేసిన లుక్ లోకి ధోని మారిపోయాడు. అది బాగా సూటయింది. మహీని ఇలా చూడటం చాలా బాగుందని అభిమానులు సంబరపడుతున్నారు. ఇక ఐపీఎల్ 14 తిరిగి ప్రారంభం అయ్యే వరకు ధోని ఖాళీయే.. అప్పటి వరకు మహేంధ్రుడు మీసం మెలేసిన లుక్ లోని కనిపిస్తాడేమో.. !

