మా సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే !

మెగా బ్రదర్స్ ఒక స్టాండ్ పై ఉండటం లేదు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ పోరాడుతుంటే.. ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. అవకాశం కల్పించుకొని మరీ.. జగన్ జపం చేస్తున్నారు. ఇది జనసైనికులకి ఏమాత్రం రుచించడం లేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ‘మా’ ఎన్నికల్లోనూ మెగా సపోర్ట్ ఎవరికి అన్నదానిపై కాసింత కన్ఫ్యూజన్ నెలకొంది.

మూడ్నేళ్ల ముందే ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సడెన్ గా మంచు విష్ణు బరిలోకి దిగడంతో.. చిరు ఇబ్బందుల్లో పడ్దారు. స్నేహితుడు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణుని కాదనలేని పరిస్థితి. ఏం చేయాలా? ప్రకాష్ రాజ్-మంచి విష్ణుల మధ్య తాను నగిలిపోయేలా ఉన్నాయని చిరు ఆలోచిస్తున్నారు. ఇంతలో మెగా బ్రదర్ నాగబాబు ఓపెన్ అయిపోయారు.

మా మద్దతు ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించేశారు. కళాకారులకు ప్రాంతీయ, భాష, స్థానిక బేధాలు వుండవని నచ్చ చెప్పే ప్రయత్నం ప్రారంభించారు. రాజకీయ కోణంలో చూస్తే.. పవన్ మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కే దక్కేలా ఉంది. దీంతో.. మెగా మద్దతు ప్రకాష్ రాజ్ కే అన్నది స్పష్టమవుతోంది. కానీ గ్రౌండ్ లెవల్ లో చూస్తే మంచు విష్ణుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. నిజంగానే మంచు విష్ణు గెలిస్తే.. మెగా ఇమేజ్ డ్యామేజ్ కానుంది.