‘కేసీఆర్ పారాసిటమాల్ పాట’పై నెటిజన్స్ ఫైర్

సీఎం కేసీఆర్ మరోసారి పారాసిటమాల్ పాట పాడారు. కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని తేల్చి చెప్పారు. వరంగల్ పర్యటనలో కరోనాపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కరోనా ఇలా వచ్చి అలా పోతుంది.. దానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. కరోనాకు మందు లేదని.. కరోనా వచ్చిన సమయంలో తాను కూడ డోలో తో పాటు మరో మందు.. బిళ్ల వేసుకొన్నానని వివరించారు. కరోనా కంటే అది వచ్చిందేమోననే భయంతో జనాలు సచ్చిపోతున్నారని చెప్పారు.

అసలే కరోనా సెకండ్ వేవ్ లో ఆప్తులు, బంధువులని కోల్పోయిన జనాలకు సీఎం చేసిన వ్యాఖ్యలు చిరాకు తెప్పిస్తున్నాయి. మీకేందీ.. ఈ రాష్ట్రానికి సీఎం. ఫామ్ హౌస్ లో పడుకొని బలమైన ఆహారం తీసుకున్నరు. అలాంటి స్థోమత, అలాంటి ఏర్పాట్లు సాధారణ జనాలకు ఉండవు కదా. కరోనాతో జనాలు పిట్టల్లా రాలిపోతుంటే.. కళ్లకు కానరాలేదా. తప్పుడు లెక్కలతో ప్రభుత్వం చీటింగ్ చేసింది. ఇప్పుడు కరోనా అంటే అసలు రోగమే కాదని సీఎం మాట్లాడుతున్నారు.. అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు. 

కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి కేసీఆర్ పారాసిటమాల్ పాట పాడటంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారాసిటమాల్ తో కరోనా తగ్గిపోతే.. రాష్ట్రంలో ఇన్ని కేసులు ఎందుకు వచ్చినట్టు ? ఇంతమంది ఎందుకు చనిపోయినట్టు ? అని ప్రశ్నిస్తున్నారు.