రవితేజ మళ్లీ రేటు పెంచేశారు

మాస్ మహారాజా రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గరని చెబుతుంటారు. ‘క్రాక్’ సినిమాతో మాంచి హిట్ కొట్టారు. రమేష్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ‘ఖిలాడి’ సినిమా సగానికి పైగా పూర్తి కావచ్చింది. కొత్త డైరక్టర్ తో సినిమా ఓకె చేసారు. నక్కిన త్రినాధరావు సినిమా వుంది. అయితే కొత్తగా ఎవరైనా అప్రోచ్ అయితే 17 కోట్లు అడుతున్నారన్నర్ట.

వరుణ్ తేజ్ 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతుంటే.. రవితేజ ఏకంగా 17 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే న్యూస్ బయటికొచ్చింది. నాన్ థియేటర్ రైట్స్ అదనంగా రావడం అన్నది నిర్మాతలకు కాస్త ఆనందం కలిగించింది. ఇంతలో హీరోలందరూ రెమ్యూనిరేషన్లు పెంచుతూ షాక్ ఇస్తున్నారు. కొంత తగ్గించుకోవచ్చు కదా.. ? అని అడిగితే.. ఆ మాట రూ. 50కోట్లు తీసుకుంటున్న వారికి చెప్పండని అంటున్నారట.