‘మా’ ఎన్నికలు.. అదిరిపోయే ట్విస్ట్.. సీన్’లోకి జీవిత రాజశేఖర్ !
‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటి పడబోతున్న సంగతి తెలిసిందే. మెగా మద్దతు ప్రకాష్ రాజ్ కే దక్కింది. ఆయనకు మూడ్నెళ్ల ముందే మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా మా మద్దతు ప్రకాష్ రాజ్ కేనని ప్రకటన కూడా చేశారు. అయినా.. గెలుపు అవకాశాలు మంచు విష్ణుకే ఎక్కువ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ నాన్ లోకల్. మంచు విష్ణు లోకల్. అది ఆయనకు ప్లస్ కానుంది. పైగా యువకుడు. ఇదీగాక.. తెరవెనక ప్రజెంట్ మా అధ్యక్షుడు నరేష్ ఉన్నారు. ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. నరేష్ వర్గానికి చెందిన దాదాపు 200 మంది మంచు విష్ణు వైపే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో నరేష్ శత్రువర్గం నిద్రలేచింది. తాజాగా జీవిత రాజశేఖర్ సీన్ లోకి వచ్చేశారు.
మా అధ్యక్ష పదవి కోసం ఆమె బరిలోకి దిగితున్నారు. దీంతో మాలో తీన్ మార్ మొదలైంది. జీవిత గెలుపు కోసం బరిలోకి దిగినట్టు అనిపించడం లేదు. నరేష్ పై పగ తీర్చుకోవడం కోసమే సీన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే జీవిత స్వతహా సీన్ లోకి వచ్చిందా.. ? దీని వెనక ప్రకాష్ రాజ్, మెగా ఫ్యామిలీ వ్యూహాలు ఉన్నాయా ? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.