‘నా కొడుకు ఆరేళ్ల నుంచి టైగర్ డేటింగ్ ఉన్నాడు’

తనయుడి ప్రేమ వ్యవహారాలని తండ్రి గొప్పగా చెప్పుకొనే రోజులు వచ్చేశాయ్. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్-దిశా పటానీల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరు చాన్నాళ్ల నుంచి డేటింగ్ లో ఉంటున్నారు. కలిసి పార్టీలు, పబ్ లకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. తాజాగా తన కుమారుడు టైగర్ ప్రేమ వ్యవహారంపై నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు.

“అది టైగర్ వ్యక్తిగత జీవితం. 25 సంవత్సరాల వయసు నుంచే టైగర్ డేటింగ్‌లో ఉన్నాడు. టైగర్-దిశా మంచి స్నేహితులు. వాళ్లిద్దరి అనుబంధం భవిష్యత్తులో ఎంతవరకూ వెళ్తుందనే దానిపై నాకెలాంటి ఆలోచన లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను టైగర్ ఫోకస్ ప్రస్తుతానికి వర్క్ పైనే ఉంది. ప్రేక్షకులు మెచ్చుకునేలా మంచి చిత్రాలు అందించాలని అతను భావిస్తున్నాడు” జాకీ చెప్పుకొచ్చారు.