‘లైగర్’కు రూ.200కోట్లు.. చాలా తక్కువ !

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోవిజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘లైగర్‌.మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. విజయ్‌ సరసన బాలీవుడ్‌ భామ అనన్యపాండే నటిస్తుంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీలకపాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఇటీవల ఓటీటీల నుంచి లైగర్ కు భారీ ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమే. ఈ ఆఫర్‌పై విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ ద్వారా స్పందించాడు.

థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలకు, అన్ని భాషల్లో శాటిలైట్‌ రైట్స్‌కు కలిపి రూ.200 కోట్లు ఆఫర్‌ చేసిందట. అయితే ఇది చాలా చిన్న మొత్తం.. ఇంతకంటే ఎక్కువ మొత్తం థియేటర్లో చూస్తారని విజయ్‌ అన్నారు. విజయ్ తన ట్విట్ తో లైగర్ థియేటర్స్ లోని రిలీజ్ అవుతుందని క్లారిటీ కూడా ఇచ్చినట్టయింది. ఇక కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా లైగర్ షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించబోతున్నారు.