కేసీఆర్ కొత్త అబద్ధాలు
సీఎం కేసీఆర్ పాతవి మరిచి.. కొత్త అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు బీజేపీ మహిళానేత విజయశాంతి. కేసీఆర్ వరంగల్ టూర్ పై ట్విట్టర్ వేదిక స్పందించిన రాములమ్మ.. సీఎం మానసిక పరిస్థితిపై ప్రజలకు అనుమానం కొడుతుందని అన్నారు. గతంలో ఇచ్చిన వాగ్ధాలు మరచి.. కొత్తవి చెబుతుండు. వర్థంతిని జయంతి అంటున్నంటూ.. వరుస ట్విట్స్ చేశారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, డబుల్ బెడ్రూం ఇళ్ళన్నరు.. కుర్చీ వేసుకు కూర్చుని పూర్తి చేసి కల్లు తాగి దావత్ చేసుకుంటానన్నరు. ఇవన్నీ ఏమైనవో తెల్వదు.
ఇప్పుడు మల్లా తుగ్లక్ తీరున ఈ వాగ్దానాలు. తెలంగాణ ప్రజలు అమాయకులనా. లేక ఈ సీఎం గారి మానసిక పరిస్థితి సరిలేక ఇదంతా జరుగుతున్నదా ? అని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. అసలు అమలు కాని, అమలు చెయ్యని ఇలాంటి అవకతవక, అనాలోచిత హామీలు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు జిల్లాలు పర్యటించుడు. వారి ఆలోచన సమతుల్యతను సందేహించాల్సినట్లుందనే అభిప్రాయాలు తెలంగాణ సమాజంలో బలపడుతున్నాయి” అంటూ విజయశాంతి వరుస ట్విట్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు. జయశంకర్ గారి వర్ధంతిని జయంతి అంటున్రు. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నరు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి,— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 21, 2021
డబుల్ బెడ్రూం ఇళ్ళన్నరు..కుర్చీ వేసుకు కూర్చుని పూర్తి చేసి కల్లు తాగి దావత్ చేసుకుంటానన్నరు… ఇవన్నీ ఏమైనవో తెల్వదు. ఇప్పుడు మల్లా తుగ్లక్ తీరున ఈ వాగ్దానాలు. తెలంగాణ ప్రజలు అమాయకులనా. లేక ఈ సీఎం గారి మానసిక పరిస్థితి సరిలేక ఇదంతా జరుగుతున్నదా?అని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి.— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 21, 2021