స్వర్ణకాంతులతో యాదాద్రి ధగధగ
యాదాద్రిలో జరుగుతున్న ఆలయ జీర్ణోద్దరణ అద్భుత కళాఖండంగా అవతరిస్తోంది. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తిరిగి ప్రయాణంలో యాదాద్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సరికొత్త విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు.దేవాలయం చుట్టూ మొత్తం 160 నూతన బ్యాలెట్ లైట్లను బిగించగా ఆ విద్యుత్ దీపాలను మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు.
రాత్రి వేళలో బంగారు, పసుపు వర్ణంలో యాదాద్రి ఆలయం ధగధగ మెరిసిఫోతోంది. శ్రీలక్ష్మీనరసింహుడి నేల నయన మనోహరంగా దర్శనమిస్తోంది. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న యాదాద్రి ఆలయం ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇవి నిన్న సీఎం పర్యటన సమయంలో తీసినవి. పనులన్నీ పూర్తి చేసి.. పూర్తి విద్యుత్ లైట్లని వేస్తే.. యాదాద్రి టెంపుల్ కనిపించే స్వర్గంగా కనిపించబోతుంది.