గాంధీలో తిరిగి సాధారణ సేవలు ఎప్పటినుంచంటే ?
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో హైదరాబాద్ గాంధీ హాస్పటల్ ని మరోసారి పూర్తిస్థాయి కోవిడ్ హాస్పటల్ మారిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి ఇతర సేవలని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై మొదటి వారం తర్వాత ఎప్పుడైనా ఇతర సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 400 మందిలోపు మాత్రమే చికిత్స పొందుతున్నారు. గతంలో నిత్యం 200 మందికి వరకు చేరితే ప్రస్తుతం ఆ సంఖ్య 15-20కు తగ్గింది. రోజూ 30-40 మంది డిశ్ఛార్జి అవుతున్నారు. మరోవైపు మ్యూకార్‌మైకోసిస్(బ్లాకఫంగస్) బాధితులు మాత్రం గాంధీ బాట పడుతున్నారు. నిత్యం 20 మంది వరకు వివిధ జిల్లాల నుంచి చికిత్స కోసం చేరుతున్నారు. ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్ బాధితులు 300 మంది వరకు చికిత్స పొందుతున్నారు.