ఆ నటుడు హాఫ్ బాయిల్డ్.. ఘోరంగా అవమానించిన గూగుల్ !
కన్నడ నటుడు డా.రాజ్‌కుమార్ ని గూగుల్ ఘోరంగా అవమానించింది. ఆయన్ని హాఫ్ బాయిల్డ్ పేర్కొంది. తమిళ సినిమా విక్రమ్ వేద గురించి గూగుల్‌లో గాలిస్తే సినిమా పాత్రల జాబితాలో కన్నడ కంఠీరవ డా.రాజ్‌కుమార్ ఫోటో కింద హాఫ్ బాయిల్డ్ అని రాసి ఉంది. ఈ విషయాన్నినటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి వెలుగులోకి తీసుకొచ్చారు.
ఇది గూగుల్ సంస్థ తప్పిదమేనని కన్నడ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే గూగుల్‌లో కన్నడ భాషను కించపరచడంపై వివాదం మరువకముందే.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ అభిమానులకు, కన్నడ సినీ పరిశ్రమకు గూగుల్ క్షమాపణలు చెప్పి… తప్పును సరిద్దిద్దుకోనుంది. ఇలాంటి తప్పులు.. పప్పులో కాలేయడాలు గూగుల్ కి కొత్తేమీ కాదు. ఇలాంటి తప్పిదాలు గూగుల్ లో నెలకోటి వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.