విజయ్ ట్విట్టర్ సెషన్.. ఓ రికార్డ్!

జయ్ జన్మదినం సందర్భంగా ట్విటర్‌లో అరుదైన రికార్డు నమోదైంది. జూన్ 21న విజయ్ బృందం ట్విటర్ సెషన్ ఏర్పాటు చేసింది. అత్యధిక మంది హాజరైన సెషన్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఇందులో 27,500 మంది పాల్గొన్నారు.

మనదేశంలో ఎక్కువమంది పాల్గొన్న సెషన్‌లో ఇదే మొదటిదిగా నిలిచింది. అలాగే ప్రపంచంలో రెండోదిగా కూడా గుర్తింపు పొందింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన బామ్‌బామ్ అనే ర్యాపర్ ఏర్పాటు చేసిన సెషన్‌లో అత్యధికంగా 44,000మంది పాల్గొన్నారు. ఆ తర్వాత విజయ్‌దే రికార్డు.

ఈ సెషన్‌లో పలువురు సినిమా తారలతో పాటు విజయ్ కూడా పాల్గొన్నారు. హీరోయిన్లు కీర్తి సురేశ్, మాళవికా మోహనన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, ‘బీస్ట్’ దర్శకుడు దిలీప్‌కుమార్ పాల్గొని విజయ్‌తో తమ సినిమా ప్రయాణాన్ని పంచుకున్నారు.