అవికాగోర్‌తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చేశాడు !
బాలికావధు’తో (చిన్నారిపెళ్లికూతురు) బాలనటిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అవికాగోర్. ఆ సీరియల్ తొ అశేషమైన అభిమానులను సంపాదించుకొన్న అవికా ప్రస్తుతం సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే నటుడు మనీశ్‌రాయ్ సింగన్ తో అవికా సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉంది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిందన్నారు. తాజాగా ఈ వార్తలపై మనీశ్ స్పందిస్తూ.. ‘అవికా నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరు వ్యక్తులు స్నేహంగా ఉంటే ఎందుకని తట్టుకోలేరు? వాళ్ల స్నేహాన్ని రిలేషన్‌షిప్‌గా మీరు ఎలా అనుకుంటున్నారు? అవికా కంటే వయసులో నేను 18 సంవత్సరాలు పెద్ద. ప్రస్తుతం తను మిలింద్ చంద్వాణీతో డేటింగ్లో ఉంది. వాళ్ల లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే , నేను కూడా గతేడాది వివాహం చేసుకున్నాను. ఇలాంటి రూమర్స్ చూసి నా సతీమణి నవ్వుకుంటుంది’ అని మనీశ్ వివరించారు.
ప్రస్తుతం అవికా నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు కల్యాణ్‌దేవ్ హీరోగా వస్తున్న మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ రెండు కాకుండా.. మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.